Tuesday, 3 November 2026

పేద కుటుంబాలకు అండగా సీఎం కేసీఆర్

పేద కుటుంబాలకు అండగా సీఎం కేసీఆర్
ఎంపీపీ ఈదురు రాజేశ్వరి
పెద్దవంగర అక్టోబర్ 29(జనం సాక్షి )తెలంగాణ పేద ప్రజల సంక్షేమమే సీఎం కెసిఆర్ లక్ష్యమని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి అన్నారు.శనివారం చిట్యాల గ్రామానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు ముగ్గురికి కలిపి 122500 తెరాస పార్టీ మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్యతో కలిసి వారి ఇండ్ల లోకి స్వయంగా వెళ్లి చెక్కులను పంపిణి చేయడం జరిగిందని తెలిపారు. వీటితో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో చిట్యాల గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ తెరాస పార్టీ ఉపాధ్యక్షులు మొగులగాని హరీష్, ప్రధాన కార్యదర్శి వల్లపు పరమేష్, గ్రామ తెరాస నాయకులు రాపోలు సుదర్శన్, గ్రామ ఎస్ సి సెల్ అధ్యక్షులు ఈదురు సోమయ్య, మాజీ వార్డు సభ్యులు కొయ్యేడి యాకయ్య, ఈదురు వెంకటయ్య, ఈదురు రాములు, గ్రామ తెరాస యూత్ ప్రధాన కార్యదర్శి ఎల్తూరి మహేష్,యూత్ నాయకులు రాపోలు దేవేందర్, మహిళాలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు