పేద ప్రజలకు అండగా ఆరాధ్య ఫౌండేషన్
జనంసాక్షి నవంబర్ 20 : పేద ప్రజలకు అండగా ఆరాధ్య ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ప్రజా వాగ్గేయకారుడు జయరాజ్, ఇండియన్ రైల్వేస్ అసోసియేట్ ప్రొఫెసర్ రసూల్ సాహెబ్ లు అన్నారు. శనివారం మున్సిపల్ కేంద్రంలో ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ పెద్దమ్మ గుడి నుండి చెరువు కట్ట పోతాయి గడ్డ మీదుగా బైక్ ర్యాలీ జిఎంఆర్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. అంతకుముందు పెద్దమ్మ గుడిలో ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు .బైక్ ర్యాలీ సందర్భంగా జగ్జీవన్ రామ్, గాంధీ, అంబేద్కర్, పూలే, సర్వాయి పాపన్న విగ్రహాలకు వాణి శ్రీకాంత్ రాజు దంపతులు పూలమాలు వేసి నివాళులు అర్పించారు .అనంతరం జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో సీనియర్ జర్నలిస్ట్ ఎస్ ఎన్ చారి అధ్యక్షతన జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో 8000 మందికి రూ. 48 లక్షల సొంత డబ్బులతో పోస్టల్ ప్రమాద బీమా, సుకన్య యోజన పథకాలు పేద, నిరుపేదల కోసం ఆరాధ్య ఫౌండేషన్ అందజేయడం అభినందనీయం అన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన నాయకుల పని శ్రీకాంత్ రాజు ఆరాధ్య ఫౌండేషన్ తో చేయడం విశేషం అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం తాము ఎంతో పోరాడమని, ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు సేవ చేయడంతోనే సంతృప్తి పొందాలని అనుకుంటున్నామే తప్ప ,ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేది లేదని తేల్చి చెప్పారు.తమ కార్యక్రమాలకు కలెక్టర్, డి సి పి లు ముఖ్య అతిథిగా పిలవగా, కొంతమంది రాజకీయ దురుద్దేశ్యం తో అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి తొత్తులము కాదని, ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని ,నిస్వార్ధమైన సేవలే తమ లక్ష్యమని అన్నారు .ఫౌండేషన్ ప్రతినిధులు ప్రజా ప్రతినిధులుగా రాజకీయాల్లోకి వెళితే తమ ఆర్థిక సహకారాలు అందిస్తామన్నారు. యువత ను రాజకీయాల్లోకి ప్రోత్సహించి పేదలకు సేవలు అందించే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. తుంగతుర్తి నియోజవర్గం ఎస్సీ కి రిజర్వ్ అయిందని, తాము బీసీలమని ఎలా పోటీ చేస్తామని ప్రశ్నించారు. పౌండేషన్ ను ఆరాధిస్తున్న ప్రతి సభ్యులకు పౌండేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు .మోదుగు పూల ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కవులు,కళాకారులు, జర్నలిస్టుల తో సభను నడిపించి ,సేవా కార్యక్రమాలు చేపడుతున్న మీకు తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులను శాలువాలు మెమోంటో లతో సన్మానించారు .ఫౌండేషన్ నివేదికను సభ్యుడు కాపర్తి సైమన్ చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ ఐపీఓ సిల్వెర్ రవి, బుక్యా శ్రావణి,గాయకుడు దరువు అంజన్న,సీనియర్ జర్నలిస్టు కాయితాల నర్సిరెడ్డి, టి యూ డబ్ల్యూ జె ఐ జె యూ జిల్లా కార్యదర్శి వెల్మినేటి జహంగీర్,గుంటి ఐలయ్య, ఆరాధ్య ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పత్తేపురం విజయ్ ,మండల ప్రతినిధులు గనగాని నర్సింహా,దబ్బేటి సోంబాబు,బీసు వెంకటేష్, సాయి ప్రమోద్,మామిడాల సర్పంచ్ కరుణాకర్, సామ ఆంజనేయులు, ఉప్పలయ్య ,కల్వల నరేష్ వెంకట్ వంశీ ,శ్రీకాంత్ ,సురేష్ ,ఉదయ్ సైదులు ,ఆచారి ,మహేష్ ,నాగరాజు, రామబ్రహ్మం, సోమన్న లింగస్వామి తదితరులు పాల్గొన్నారు




