పేదలు, రైతుల పార్టీ బీఆర్ఎస్కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు.పేదల అభ్యున్నతి కేసీఆర్ లక్ష్యంతెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా దళారుల ప్రమేయం లేకుండా సంక్షేమ, అభివృద్ధి పథకాలుకార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపిన భువనగిరి మండల ఆత్మీయ సమ్మేళనంభువనగిరి టౌన్ :— భువనగిరి మండలం హనుమాపురం గ్రామంలోని కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హల్ నందు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మరియు ఆత్మీయ సమ్మేళనాల జిల్లా అధ్యక్షులు వంటేరు యాదవ రెడ్డి జడ్పీ చైర్ పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచల రామకృష్ణారెడ్డి పాల్గొనిస్వాతంత్ర్యం సాధించిన తర్వాత ఏడు దశాబ్దాల చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధిని తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ చేసి చూపించారని,నేడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని అన్నారు…గ్రామాలలో రోడ్లు బాగయ్యాయి, పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగయింది, సాగు నీరు సమృద్ధిగా ఉంది. పంటలు బాగా పండుతున్నాయి అని తెలియజేశారు…పల్లె ప్రకృతి వనాలు, హరితహారం పథకాలు కొత్త శోభ తెచ్చాయి .. ఇది గ్రామీణులు పరిశీలించి చెబుతున్న మాట.సీఎం కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు అందరూ కలిసికట్టుగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అధికారం కోసం పాకులాడుతున్న బిజెపి కాంగ్రెస్ పార్టీల మాయ మాటలు నమ్మొద్దు అని, వారి కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ,జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి మార్కెట్ చైర్మన ఎడ్ల రాజేందర్ రెడ్డి రైతు సమన్వయ కన్వీనర్ అమరేందర్ నోముల పరమేశ్వర్ రెడ్డి అన్న మాస రమేష్ జడ్పిటిసి బీర్ మల్లయ్య ఎంపీపీ నరాల నిర్మల, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి , మండల అధ్యక్షుడు జనగాం పాండు మాజీ ఎంపీపీ కేశపట్నం రమేష్ మాజీ పిఎస్ చైర్మన్!,బలుగురు మధుసూదన్ రెడ్డి, సర్పంచులు బొమ్మూరు సురేష్ , గణేష్ ఉడుత శారద వెంకటేశం శ్యామల వెంకటేశం రాంపల్లి కృష్ణ కస్తూరి శ్రీశైలం, చిన్న మల్లికార్జున్ బోయిని పాండు, తాజ్పూర్ పసర్పంచ్ రేకల సంతోషి శ్రీనివాస్ రామశాల అధ్యక్షులు బిఆర్ఎస్ మండల్ నాయకులు రాకల శ్రీనివాస్, ఓం ప్రకాష్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




