Wednesday, 4 November 2026

సర్పంచ్ గఫ్ఫార్ పటేల్ కు ఆలయ అధికారి సన్మానం

 

 

 

 

బిచ్కుంద ఏప్రిల్ 07 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోనిమద్నూర్ మండలం రాష్ట్ర సరిహద్దు గలా ప్రసిద్ధమైన ఆంజనేయ (మిర్జాపూర్ ) ఆలయంలో హనుమాన్ జయంతి గురువారం రోజున భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించినారు. శుక్రవారం నాడు మిర్జాపూర్ ఆలయ ఈ.ఓ శ్రీధర్ శక్కర్గ గ్రామ సర్పంచ్ గఫ్ఫార్ కు శాలువా తో సన్మానం చేసి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఓ శ్రీధర్ మాట్లాడుతూ మిర్జాపూర్ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సాహం ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, హనుమాన్ జయంతి రోజున మూడు రాష్ట్రాల తెలంగాణ , మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని ఆంజనేయ స్వామి యొక్క దర్శనం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సర్పంచ్ గఫ్ఫార్ గత 3 రోజుల నుండి హనుమాన్ జయంతి ఉత్సాహ కార్యక్రమంలో పాల్గొని దగ్గరగా ఉండి అన్ని పనులు సత్వరంగా నిర్వహించే విధంగా, భక్తులకు ఆలయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా  దృష్టి వహించడం జరిగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ , పండరీ పాటిల్, ఆలయ సిబ్బంది పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.