Tuesday, 3 November 2026

పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం

అల్వాల్ (జనంసాక్షి) జూన్ 26
 అల్వాల్ పట్టణ కేంద్రంలోని పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని సామాజిక సేవ కార్యకర్త అనిత అన్నారు. ఆదివారం మచ్చ బొల్లారం డివిజన్ పరిధి సెలెక్ట్ పార్టీ సమీపంలోని సంతోష్ మోటార్స్ వద్ద సామాజిక కార్యకర్త అనిత ఆధ్వర్యంలో ఓజోన్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎంతో తృప్తిని ఇస్తుందని సామాజిక కార్యకర్త అనిత అన్నారు. సందర్భంగా తమకు పూర్తి సహకారం అందించిన సంతోష్ మోటార్స్ యజమాన్యంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.