*హౌసింగ్ సొసైటీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల.*

హౌసింగ్ సొసైటీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల.*
కోదాడజూన్ 27(జనం సాక్షి)
  కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నూతన కార్యవర్గ ఎన్నికకు సంభందించిన ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం కో-ఆపరేటివ్ ఎన్నికల  అధికారి సిహెచ్ అంబేద్కర్ విడుదల చేశారు.
సోమవారం పట్టణంలో సొసైటీ ఆద్వర్యంలో వ్యవసాయ మార్కెట్ గెస్డ్‌ హౌస్‌లో జరిగిన  సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సహకార ఎన్నికల అధారిటి తెలంగాణ ప్రభుత్వ అదేశానుసారం ఈ నెల 30వ తేదీన నానిమేషనల దాఖలు,వాటి పరిశీలన అనంతరం అదే రోజు ఎన్నిక ప్రారంభించి ఫలితాలు కూడా అదేరోజు వెల్లడిస్తున్నట్లు ఎన్నికల అదికారి తెలిపారు. ఈ ఎన్నిక సొసైటి సభ్యులు చేతులెత్తు విదానంతో ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.