;- జనంలో చైతన్య నింపే ఆరోప్రాణమే – నాట్య బృందం
;-ప్రజ గర్జన సభకు వేల మంది తరలిరావాలి..
;-నాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టేపాక రవన్న…పిలుపు
హన్మకొండ 8 జూన్ జనంసాక్షిగురువారం రోజున హన్మకొండ బాల సముద్రం జిల్లా కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ప్రజా నాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టేపాక రవన్న మాట్లాడుతూ,తెలంగాణ ప్రజానాట్యమండలి ముఖ్య కళాకారుల సమావేశం ఏర్పాటు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు రాజ్యాంగ లౌకిక వ్యవస్థల పరిరక్షణకై భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 11న .కొత్తగూడెంలో నిర్వహించే ప్రజా గర్జన బహిరంగ సభకు కవులు,కళాకారులు,మేధావులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వేలాదిగా, తరలి రావాలని పిలుపునిచ్చారు, అనంతరం ప్రతి “పేద వాడి… జన నాడి… కళాకారులే “అని అన్నారు. ఉద్యమల కు ఊపిరి కళాకారులు జనంలో చైతన్యనాని నింపే ఆరోప్రాణమే కళాకారుల నాట్య బృందం అని అన్నారు,ఈ కార్యక్రమంలో కళాకారులు కలకోట ప్రభాకర్,అంబాల గట్టయ్య,పల్లె రామ, గదె భూషణం, బైరపాక అనిత రాజారావు, శిల్ప అనిషా శిరీష డప్పు,కళాకారులు భాస్కుల నరసయ్య గాదె సమ్మయ్య కోలాట బృందం, బట్టు పావని,నళిని సింధు,యక్షగానం కళాకారులు సమావేశంలో పాల్గొన్నారు.




