వీణవంక ఏప్రిల్ 12 (జనం సాక్షి) వీణవంకవంక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా గురుకుల పాఠశాలలను కేటాయించిన సందర్భంలో మండల కేంద్రానికి గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల కేటాయించాలని గతంలో విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఫలితంగా2019 విద్యా సంవత్సర ప్రారంభంలో జ్యోతిబాపూలే బాలూరి పాఠశాలను కేటాయించగా అప్పుడున్న స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి ఈటల రాజేందర్ వీణవంక మండల కేంద్రంలో ఉండాల్సిన విద్య కేంద్రాన్ని అప్పటి అనివర్య కారణాల వలన హుజరాబాద్ లో పెట్టడం జరిగింది. కానీ హుజురాబాద్ ఉప ఎన్నికలలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి వారి ఆదేశాల మేరకు
వీణవంక మండల కేంద్రానికి విద్యా కేంద్రాన్ని రాబోయే విద్యా సంవత్సరం లోపు మండల కేంద్రంలో గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల బాలురికి సంబంధించిన అన్ని వసతులను ఏర్పాటు చేయడం కోసం ఈరోజు పాఠశాల ప్రిన్సిపాల్, ఏ ఈ పర్యవేక్షణలో దానికి సంబంధించిన ఎన్ని నిధులు కావాలో అంచనా వేయడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరంలోపు జ్యోతిబాపూలే గురుకుల బీసీ పాఠశాలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టి హెచ్ ఆర్ టీం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హరీష్ వర్మ అప్పని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఏ ఈ రమేష్ పి ఈ టి భరత్ టి హెచ్ ఆర్ టీం సోషల్ మీడియా కన్వీనర్ కాట్రేవుల అజయ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు*
మండలానికి చేరువగా విద్యా కేంద్రం




