‘రాత’ మారట్లేదు..పేరుకే ఫోర్త్ ఎస్టేట్…ఆర్థిక స్థితిగతుల్లో దయనీయ స్థితి..
వైరా ఫిబ్రవరి 12న (జనం సాక్షి)సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ప్రత్యేక స్థానం కలిగిన జర్నలిస్టులు ఆర్థిక స్థితిగతుల్లో మెజార్టీ జర్నలిస్టు లు దయనీయ స్థితిలో ఉన్నారని జర్నలిస్టుల దీక్షకు మద్దతు తెలిపిన పలు పార్టీల నాయకులు కుల సంఘాల నాయకులు పేర్కొన్నారు..జర్నలిస్టుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకుంది .. ఈ దీక్షకు సిపిఐ పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రబాబు వైరా మండల కార్యదర్శి యానాల గోపాలరావు షేక్ షరీఫ్ గారపాటి అశోక్ అంతేగాక సిపిఎం పార్టీ కొనిజర్ల మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు ఏఐటీయూసీ కార్యదర్శి రజాక్మియా భూక్య వీరభద్రం తో పాటుగా వైరా మున్సిపాలిటీ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు దేవరకొండ శ్రీనివాసరావు కుదురుపాక దర్గయ్య మండల నాయకులు కుదురుపాక శ్రీహరి రాచమల్ల శ్రీనివాసరావు మంచి కంటి శంకర్ శ్రీకాకుళం శ్రీరంగం శ్రీహరి తదితరులు దీక్షకు మద్దతు తెలిపారు ఆర్ టి ఐ నాయకులు డేవిడ్ వెంకటలక్ష్మి తో పాటు ఓర్సు శీను నల్లగట్ల బాబు తదితరులు శిబిరానికి మద్దతుగా సంఘీభావం తెలిపారు వారు మాట్లాడుతూ సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టులు ఆర్థిక స్థితిగతుల్లో దయనీయ పరిస్థితుల్లో నేటికీ ఉన్నారని పత్రికల ద్వారా టీవీ ఛానల్ ద్వారా ఎన్నో మానవీయతను చాటి చెప్పే వార్తలు ప్రసారం చేసిన జర్నలిస్టుల రాతలు నేటికీ మారడం లేదని ప్రభుత్వం వారికి న్యాయం చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు




