హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి , మంత్రులు రాజీనామా చేయాలని తెదేపా సీనియర్ నేత దేవేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఘటనాస్థలిని దేవేందర్‌గౌడ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫ్యలంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని విమర్శించారు. అనంతరం గౌడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.




