Wednesday, 4 November 2026

విద్యుదాఘాతంతో తల్లీకొడుకుల మృతి

చల్లపల్లి : కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఒక్కలగడ్డ గ్రామంలో విద్యుదాఘాతంతో తల్లీ కుమారుడు మృతి చెందాడు. కోళ్లఫారంలో పని చేస్తున్న డేగుల రమణ (45) పొరపాటున అక్కడ ఉన్న విద్యుత్తు తీగాలను తాకి విద్యుదాఘాతానికి గురయింది. ఆమె కుమారుడు శేఖర్‌ (22) ఆమెను రక్షించబోయి తాను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇరువురూ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. శేఖర్‌ పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *