ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. దేశంలోని రెండు ప్రధాన నగరాలు రావల్పిండి, కరాచీ బుధవారం అర్థరాత్రి పేలుళ్ళతో దద్దరిల్లాయి. రావల్పిండిలో జరిగిన ఆత్మాహుతిదాడిలో 23 మంది చనిపోగా , కరాచీ పేలుళ్ళలో ఇద్దరు చనిపోయారు.
రావల్పిండిలో మొహర్రమ్ ఊరేగింపు జరుగుతుండగా ఆత్మాహుతిదళ సభ్యుడు దానిలోకి ప్రవేశించి తననుతాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 23 మంది మృతులుకాక 60 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు, దీనికి కొద్దిగంటముందు కరాచీలో 40 నిమిషాలతేడాతో రెండు బాంబు పేలుళ్ళు జరిగాయి. ఇక్కడ ఇద్దరు చనిపోగా, 16 మంది గాయపడ్డారు.
ఈరెండు దాడులూ తమ పనేనంటూ తెహ్రికీ తాలిబస్ పాకిస్తాన్ అనే సంస్థ ప్రకటించింది.




