Thursday, 5 November 2026

పొంగిలేటి గూటికే మేమంతా…పొంగిలేటి గూటికే మేమంతా… – బిఆర్ఎస్ పార్టీకి   పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు రాజీనామా.

 

 

 

 

బూర్గుంపహాడ్ ఏప్రిల్ 16 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గుంపహాడ్ మండలంలో పొంగిలేటి గూటికే మేమంతా అంటూ పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మూకుమ్మడిగా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మండల పరిధిలోని లక్ష్మీపురం కేంద్రంగా ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి ఫ్యాక్టరీ లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసిన వారిలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి, లక్ష్మీపురం ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి ,మొరంపల్లి బంజర ఉపసర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, అంజినాపురం ఉపసర్పంచ్ ఆనంద్ లతోపాటు మాజీ ఎంపీపీ కైపు రోసి రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు ఎడమకంటి రోసి రెడ్డి, నాగినేని ప్రోలు టిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షులు కాటం వెంకట్రామిరెడ్డి, గాదే వెంకటేశ్వర్ రెడ్డి, పాలెం లక్ష్మిరెడ్డి, దుగ్గెంపూడి శేషి రెడ్డి, సీతారామరెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …తామంతా పొంగులేటి వర్గమేనంటూ పొంగిలేటి ఏ నిర్ణయం తీసుకున్న ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని అందుకే ఈ నిర్ణయం  తీసుకున్నామని వారన్నారు.