Thursday, 5 November 2026

ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో సిపిఐది క్రియాశీలక పాత్ర – సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యాల్లవుల రాములు

హుజూర్ నగర్ ఏప్రిల్ 16 (జనం సాక్షి): ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో భారత కమ్యూనిస్టు పార్టీది క్రియాశీలక పాత్ర అని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లవుల రాములు అన్నారు. ఆదివారం ఇంటింటికి సిపిఐ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా హుజూర్ నగర్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించి నిరుపయోగంగా ఉన్న గృహ సముదాయాలను పేదలకు పంచాలన్నారు. పట్టణంలోకి భారీ వాహనాలు రాకుండా కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన రింగురోడ్డు పూర్తి చేయాలన్నారు. ఎన్నెస్పీ కాలువ నిర్వాసితులందరికీ తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ లేఅవుట్లు ఆక్రమణ గురికాకుండా నిరోధించాలని, వెంచర్ల ఏర్పాటులో అక్రమాలను తొలగించాలని కోరారు. స్థానిక పరిశ్రమలలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఈఎస్ఐ, 100 పడకల ఆసుపత్రిలో వందకు వందశాతం వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు, కంబాల శ్రీనివాస్, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, యల్లావుల రమేష్, కొప్పోజు సూర్యనారాయణ, గుండా రమేష్, సుందరి పద్మ, యల్లవుల ఉమా, పొనుగుపాటి వాసుదేవరావు, మామిడి వెంకయ్య, జడ వెంకన్న, కుడి తొట్టి సత్యవతి, సోమగాని కృష్ణ, జక్కుల రమేష్, కొట్టు మోహన్ రావు, గుండెబోయిన వెంకన్న పాల్గొన్నారు.