Thursday, 5 November 2026

పొడిచేడు లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

 

 

 

 

 

ఏప్రిల్ 14 జనంసాక్షి : మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ పి.మధు మాట్లాడుతూ అంబేద్కర్  మహనీయుడని, ఆయన  అడుగు జాడల్లో  నడవాలన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించినప్పుడే నిజమైన నివాళి  అర్పించినట్లు అన్నారు. వచ్చే సంవత్సరం అంబేద్కర్ జయంతి నాటికి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు స్టేజ్ , మెట్లు,గ్రిల్స్, నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బిజెపి జిల్లా నాయకులు దీటి సందీప్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ఇప్పిస్తానని అన్నారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిట్ట లక్ష్మయ్య,జిట్ట సైదులు, బోయపల్లి సైదులు, జిట్ట గౌతమ్, వాసు,నవీన్,ఉదయ్,ఎర్ర బంటి,శ్రీహరి, బందేల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.