Thursday, 5 November 2026

రక్తదానమే మహాదానం.. అంబేద్కర్ సంఘం యూత్  అధ్వర్యంలోరక్తదానమే మహాదానం..ఎంపీపీ ముసీపట్ల రేణుక తిరుపతి రెడ్డి

 

 

 

 

వీణవంక ఏప్రిల్ 14.( జనం సాక్షి ) వీణవంక  మండలంలోని గంగారం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక గ్రామపంచాయతీలో నిర్వహించిన రక్త శిబిరాన్ని ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ప్రారంభించారు  వారు మాట్లాడుతూ యువత ఇలాంటి కార్యక్రమాలకు ముందు రావాలని అన్నారు రక్తదానమే మహదానమని  .రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్  అంబేద్కర్ జయంతినీ పురష్కరించుకుని శుక్రవారం మండలంలోని గంగారం గ్రామంలో అంబేద్కర్ యూత్ సభ్యుల అధ్వర్యంలో నిర్వహించిన మేఘా రక్తదాన శిబిరంలో పాల్గొని మాట్లాడుతూ.గ్రామంలోని సుమారు 60 మంది యువతలు 60యూనిట్లు రక్తం ఇచ్చి యువత రక్తహీనత తో ప్రాణ ప్రాయంలో ఉన్న వారికి యువత ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం చాలా సంతోషకర విషయమని అన్నారు. రక్తదానం చేసిన యూత్ సభ్యులకు యువతకు సర్పంచ్ పింగిలి కోమాల్ రెడ్డి అంబేద్కర్ సంఘం నాయకులు రక్త  శిబిరంలో రక్తం ఇచ్చిన వారికి జ్యూస్ పండ్లు పంపిణీ చేసి వారికి ప్రోత్సహించి . కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మాడ వనమాల సాధవ రెడ్డి. గ్రామ సర్పంచ్ పింగిలి కోమాల్ రెడ్డి. ఉప సర్పంచ్ సాయిరెడ్డి. మండల ఎంపిటిసి ఎంపిటిసిల  పోరం అధ్యక్షులు కాసం వీరారెడ్డి. అంబేద్కర్ సంఘం నాయకులు పుల్లూరి సంపత్. కనకం సురేష్ . కనకం అనిల్. పుల్లూరి సారయ్య. పుల్లూరి తిరుపతి. ఊట్ల సంపత్. , అంబేద్కర్ సంఘం నాయకులు గ్రామస్తులు  తదితరులు పాల్గొన్నారు.