నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:నాగర్ కర్నూల్ జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న కొడిదల రామును యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.అచ్చంపేట నియోజకవర్గంలో బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ని పటిష్టం చేయడం జరిగింది.అలాగే కొల్లాపూర్ నియోజకవర్గం లో కుడా గ్రామ గ్రామాన బూత్ స్థాయిలో కమిటీలను వేయడం జరిగింది.అందుకు గాను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి కొడిధల రామును యూత్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించి నట్లు పలువురు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తెలిపారు.ఈ సందర్భంగా కొడిదల రాము మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి కి ఏఐసిసి సెక్రెటరీ వంశి రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నా శాయశక్తులా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొడిదల రామును నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హరీష్ గౌడ్ ఆద్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద శాలువా, పూలమాల తో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఐఎన్ టియుఎస్ జిల్లా అధ్యక్షులు డా. వేణు, శ్రీనివాస్,సల్కర్ పేట ఎంపీటీసీ అంజి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పొలమోని మస్తాన్, ప్రవీణ్,పి.జె నాని గౌడ్, కటిక శివ ప్రసాద్,మేఘావత్ శీను,నాగరాజ్ యాదవ్, ఎన్ ఎస్ యు ఐ వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేష్, శ్రీహరి, సత్యం, రాములు,రాజేష్, శివ,శివకుమార్, కిరణ్ గౌతమ్, శివ,శ్రీకాంత్, ప్రవీణ్ గౌడ్,విష్ణు, మధు, విజయ్, చంద్ర శేఖర్ గౌడ్ నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.




