Wednesday, 4 November 2026

పొడి వ్యర్ధాలను పడవేయకుండా పేదలకు అందజేయాలి మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి

హుజూర్ నగర్ మే 24(జనం సాక్షి):
ఆర్.ఆర్.ఆర్ సెంటర్ల నుండి సేకరించిన బట్టలు, బొమ్మలు , చెప్పులు ,పుస్తకాలు వంటి పొడి వ్యర్ధాలను పడేయకుండా వాటిలో ఉపయోగపడే వాటిని పేదలకు అందజేయాలని హుజూర్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చన రవి తెలిపారు. బుధవారంపట్టణంలోని 26 వ వార్డ్ నందు జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య పనులు ఆర్.ఆర్.ఆర్ సెంటర్లను చైర్పర్సన్ గెల్లి అర్చన రవి, కమిషనర్ వెంకటేశ్వర్లు పరిశీలన చేశారు. ఈ సందర్భంగాచైర్ పర్సన్ గెల్లి అర్చనరవి మాట్లాడుతూ రాబోవు వర్షాకాలం దృష్ట్యా పురపాలక సంఘం పరిధిలోగల అన్ని వార్డులలో ఉన్న రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి డ్రైనేజీలను పూడిక తీసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్,ఈఈ రాజశేఖర్ , జవాన్లు, మెప్మా సిబ్బంది సాయి కృష్ణ , వార్డ్ ఆర్.పి లు, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.