కొత్తగూడ మే 24 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఐటీడీఏ పరిధిలో జరిగిన సమ్మర్ గేమ్స్ లో విజేతలుగా నిలిచిన వారిని అభినందించిన డిడి సత్యవతి.అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని జూన్ నెలలో జరగబోయే గేమ్స్ కు అందరూ ప్రిపేర్ అయి ఉండాలని అన్నారు.అంతేకాకుండా మన జిల్లాకు మంచి పేరు,బహుమతులు తీసుకురావాలని విద్యార్థులు మంచి నైపుణ్యత కనబరచాలని అన్నారు.గత 20 రోజులుగా జరిగిన గేమ్స్ లో నేర్చుకున్న నైపుణ్యాన్ని ఇతర విద్యార్థులకు నేర్పే విధంగా వారిని సైతం క్రీడల పై ఆసక్తి పెంపొందించాలని అన్నారు.అథ్లెటిక్ తో విజయం సాధిస్తే మిగతా అన్ని గేమ్స్ లో విజయాలు అలోకగా సాధించడానికి ఎంతో ఆస్కారం ఉంటుందని అన్నారు.ప్రతి క్రీడలో విజయం సాధించే విధంగా ప్రదర్శించాలని అన్నారు.భద్రాచలం ఐటిడిఏ పరిధిలో జరిగే క్రీడలకు ముందస్తుగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ సి ఎం ఓ ఇరులాల్,ఏ టి డి ఓ భాస్కర్,ప్రధాన ఉపాధ్యాయులు తోలం దేవదాస్, హెచ్ డబ్ల్యు ఓ వెంకన్న,పిఈటి కొమ్మలు కోచ్ ధనంజి,స్వప్న,స్పోర్ట్స్ విద్యార్థులు పాల్గొన్నారు.
భద్రాచలం గేమ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలిభద్రాచలం గేమ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి




