Thursday, 5 November 2026

పొద్దుతిరుగుడు పంటను వెంటనే కొనుగోలు చేయండి కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షులు గజానంద్ పటేల్

 

 

 

 

 

జుక్కల్, ఎప్రిల్ 15,( జనంసాక్షి),పొద్దు తిరుగుడు పంటను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షులు గజానంద్ పటేల్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆయన శనివారం విలేఖర్లతో మాట్లాడుతు కామారెడ్డి జిల్లా డోంగ్లి మండల కేంద్రంలో గల సొసైటి పరిధిలో ఇప్పటివరకు సగం సన్ ఫ్లవర్ పంటను మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు తమ పంట వద్దే రాత్రింబవళ్ళు కాపుకాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంచులు లేవని సాకు చూపుతు కాంట చేయటం లేదన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చాల మంది రైతుల పంట తడిసిపోయి నష్టం వాటిల్లిందని ఆయన వాపోయారు. పంట తడిసిపోకుండా కనీసం పట్టాలు కూడా రైతులకు ఇవ్వలేక పోయారని ఆయన అన్నారు.పంట కోనుగోలు విషయంలో సొసైటి ఛైర్మన్ పక్షపాత దోరణి అవలంబిస్తున్నారని ఆయన ఆరోపించారు.తనకు అనుకూలంగా ఉన్న రైతుల కాంటా తొందరగా చేస్తున్నారని విమర్శించారు.ఈ సొసైటీ ఛైర్మన్ డిసిసిబి డైరెక్టర్ గా కూడ కొనసాగుతున్నారని, అయినప్పటికీ రైతులకు న్యాయం చేయలేక పోయారని విమర్శించారు. చేతకాక పోతే రాజీ నామాచేయాలిగాని ,రైతులకు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన విమర్శించారు. ఆయన వెంట రైతులు సాయిగొండ, ఉమాకాంత పటేల్, ముజ్జు పటేల్, నాగ్ నాథ్ పటేల్, సతీష్ పటేల్, సాదక్ సాబ్ తదితరులు న్నారు.