Tuesday, 3 November 2026

పొలంలో ఒంటరిగా ఉన్న మహిళ పై లైంగిక వేదింపులకు గురిచేసిన వ్యక్తికి గ్రామస్తులు దేహ శుద్ది

పొలంలో ఒంటరిగా ఉన్న మహిళ పై లైంగిక వేదింపులకు గురిచేసిన వ్యక్తికి గ్రామస్తులు దేహ శుద్ది

ఇంద్రకరణ్ పోలీసులకు వ్యక్తి పై పిర్యాదు

(సంగారెడ్డి కంది జనం సాక్షి న్యూస్

సంగారెడ్డి జిల్లా కంది మండలం కలివేముల గ్రామం లో ఓ వ్యక్తికి దేహ శుద్ది చేశారు ఆ గ్రామస్తులు వివరాల్లోకి వెళ్తే ప్రతిరోజూ లాగా ఆ లావణ్య అనే మహిళ పోలం పనికి వెళ్ళింది అయితే పొలం లో దుక్కి దున్నడం కోరకు అదే గ్రామానికి చెందిన తాలరి పాండు (కంది కోపరేట్ బ్యాంక్ సభ్యుడు పాండు కి ట్రాక్టర్ తో పనులు చేయడానికి పిలిచారు. అయితె అక్కడ కి వెళ్లిన పండు దుక్కి దున్నడం పూర్తీ చేశాడు చేశాక సాయంకాలం కాగా చీకటి పడుతుండడంతో ట్రాక్టర్ దున్నిన డబ్బులను ఇవ్వాలని అడగడ మా వారు ఇస్తారు ఇంటికి వచ్చిన తర్వాత అని ఆ మహిళ చెప్పగా అయితె డబ్బులు వద్దు ఏమీ వొద్దు ఒక్కసారి నాతో వాస్తవ నాతో అని అసభ్య పదజాలంతో మహిళను వేదించ సాగాడు అనంతరం అదేపనిగా ఆ ఒంటరిగా ఉన్న మహిళను వెంబడించి ఎవ్వరూ లేరు నాతో ఉండు అని పచ్చిగా బూతులు మాట్లాడుతు బలాత్కారం చేయబోగ ఆ మహిళ వెంటనే అరుస్తూ కాపాడండి అంటూ ఊరుకు చేరుకుని అక్కడ వున్న తన కుటుంబానికి గ్రామస్తులకు ఆమె ఒంటరిగా ఉండడంతో పండు అనే వ్యక్తీ నన్ను ఆమెను వేధింస్తు .. నా చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్రం చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు అని ఏడుస్తూ చెప్పింది..విషయం విన్న ఆ మహిళ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీసుకుని ఆ వ్యక్తి ఊరిలోకి రాగానే.. అతడిని లాగేసి చితక్కొట్టింది దాంతో పాటు గ్రామస్తులు కూడా ఆ వ్యక్తికి దేహ శుద్ది చేశారు .తాజాగా ఇరు వర్గాల వారు స్థానిక ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేశారు.