నెన్నెల, మే 25, (జనంసాక్షి )
నెన్నెల మండలం జెండా వెంకటాపూర్ గ్రామంలో శరన్ వి జానీ అనే వ్యక్తి తన ఫోన్ ఈనెల 21న పోగొట్టుకున్నాడు. ఈ విషయం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసి అట్టి ఫోన్ ను గుర్తించి గురువారం అందజేసినట్లు ఎస్సై శ్యామ్ పటేల్ తెలిపారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా తమ సెల్ ఫోన్ పోగొట్టుకున్నచో అట్టి ఫోన్ వివరాలు సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకుంటే తిరిగి పొందే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పోగొట్టుకున్న ఫోన్ అప్పగించిన పోలీసులు.




