Thursday, 5 November 2026

బుద్ధి, జ్ఞానం లేనివాడిలా రేవంత్ రెడ్డి

 

 

 

 

 

 

 

వరంగల్ బ్యూరో, మే 18 (జనం సాక్షి)బుద్ధి, జ్ఞానం లేనివాడిలా రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని, యాద‌వుల‌కు, బీసీ కులాల‌కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ చెప్పాలని, రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌లు బాధ్య‌తారాహిత్యానికి నిద‌ర్శ‌నం అని ప్ర‌భుత్వ చీఫ్ విప్‌, ప‌శ్చిమ శాస‌న‌స‌భ్యులు, బీఆర్ఎస్ పార్టీ హ‌న్మ‌కొండ జిల్లా అధ్య‌క్షులు  దాస్యం విన‌య్‌ భాస్క‌ర్  అన్నారు. తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అఖిల భార‌త యాద‌వ మ‌హాస‌భ‌ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా క‌మిటీ ఆధ్వ‌ర్యంలో హ‌న్మ‌కొండ‌లోని బాల‌స‌ముద్రం ఏక‌శిల పార్క వ‌ద్ద గురువారం రోజున  నిర్వ‌హించిన ఆత్మ‌గౌర‌వ ధ‌ర్నా కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ చీఫ్ విప్ మాట్లాడుతూ… ప్ర‌జాప్ర‌తినిధిగా ఉన్న రేవంత్ రెడ్డి ఒళ్లు జాగ్ర‌త్త‌గా ఉంచుకుని మాట్లాడాలని సూచించారు. అహంకారంతో వ్య‌వ‌హ‌రించే రాజ‌కీయ నాయ‌కుల‌కు, పార్టీల‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారని హెచ్చ‌రించారు. ఏ కులాల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీసినా ఊరుకునేది లేదని అన్నారు. అన్ని కులాల‌కు అండ‌గా కేసీఆర్ ప్ర‌భుత్వం ఉంటోందని స్ప‌ష్టం చేశారు. రేవంత్ రెడ్డికి యాద‌వులు క‌చ్చితంగా బుద్ధి చెబుతారురేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు యావ‌త్ యాద‌వ జాతిని అవ‌మాన‌ప‌ర్చే విధంగా ఉన్నాయని, రేవంత్ రెడ్డికి యాద‌వులు క‌చ్చితంగా బుద్ధి చెబుతారని కుడా చైర్మ‌న్ సంగంరెడ్డి సుంద‌ర్ రాజ్ యాద‌వ్ అన్నారు. ఒక ఎంపీ గెలిచిన ప్ర‌జాప్ర‌తినిధి ఒక కులాన్ని కించ‌ప‌రిచేలా మాట్లాడ‌డం సిగ్గుచేటు అని అన్నారు. మే 24లోపు రేవంత్ రెడ్డి యాద‌వ స‌మాజానికి క్ష‌మాప‌ణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో రానున్న రోజుల్లో యాద‌వులు రేవంత్ రెడ్డి రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు స‌మాధి క‌డుతారని హెచ్చ‌రించారు. వృత్తి కులాల‌ను కించ‌ప‌రిచే రేవంత్ రెడ్డి రోజు గ‌డ‌వాలంటే తినే తిండి ద‌గ్గ‌రి నుంచి నిద్ర‌పోయే వ‌ర‌కు ఆయా కులాలు లేనిది బ‌తుకు గ‌డ‌వ‌ద‌ని అన్నారు.  రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌కు  నిర‌స‌న‌గా దున్న‌పోతుతో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ‌ను తొక్కించి రేవంత్ రెడ్డి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ త‌ర్వాత రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. యాద‌వుల జోలికొస్తే రేవంత్ రెడ్డికి రాజ‌కీయంగా ఎన్నిక‌ల్లో  రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి త‌గిన గుణ‌పాఠం చెబుతామ‌ని అఖిల భార‌త యాద‌వ మ‌హాస‌భ ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా అధ్య‌క్షులు లోడంగి గోవ‌ర్ధ‌న్ అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు ఒక్క మంత్రి శ్రీ‌నివాస్‌ను అవ‌మానించిన‌ట్లుగా కాకుండా స‌మ‌స్త యాద‌వ జాతిని అవ‌మానించేలా ఉన్నాయని, త‌క్ష‌ణ‌మే యాద‌వ స‌మాజానికి క్ష‌మాప‌ణ చెప్పాలని అఖిల భార‌త యాద‌వ మ‌హాస‌భ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా అధ్య‌క్షులు గిర‌బోయిన రాజ‌య్య యాద‌వ్ డిమాండ్ చేశారు. యాద‌వులు ఉంటే త‌క్క‌వ భావ‌న క‌లిగి ఉండ‌డం త‌గ‌దని, యాద‌వుల జోలికొస్తే రేవంత్ రెడ్డికి రాజ‌కీయ స‌మాధి క‌డతామ‌ని అఖిల భార‌త యాద‌వ మ‌హాస‌భ వ‌రంగ‌ల్ జిల్లా అధ్య‌క్షులు బొల్ల‌బోయిన కిశోర్ యాద‌వ్ అన్నారు. కార్య‌క్ర‌మంలో జీడ‌బ్ల్యూఎంసీ కార్పొరేట‌ర్లు బొంగు అశోక్ యాద‌వ్‌, మామిండ్ల రాజు యాద‌వ్‌, బైర‌బోయిన దామోద‌ర్ యాద‌వ్‌, జ‌క్కుల శ్రీ‌నివాస్ యాద‌వ్, కావ‌టి క‌వితా యాద‌వ్‌, ఐన‌వోలు దేవ‌స్థానం చైర్మ‌న్ జ‌య‌పాల్ యాద‌వ్, గొర్రెల‌, మేక‌ల పెంప‌కందారుల సంక్షేమ సంఘం అధ్య‌క్షులు బొజ్జ ర‌వీంద‌ర్ యాద‌వ్‌, ర‌వి యాద‌వ్‌, రాహుల్ యాద‌వ్‌, కృష్ణ‌మూర్తి యాద‌వ్, ఆబోతు రాజు యాద‌వ్, జ‌క్క మ‌ల్ల‌య్య‌, ఎల్లావుల‌ కుమార్ యాద‌వ్‌, రాజేంద‌ర్ యాద‌వ్‌, అశోక్ యాద‌వ్‌, రాజ‌య్య యాద‌వ్‌, దాడి ర‌మేష్ యాద‌వ్‌, భిక్ష‌ప‌తి యాద‌వ్‌, రాకేష్ యాద‌వ్‌, రాజు యాద‌వ్‌, ర‌వి యాద‌వ్‌, యుగేంద‌ర్ యాద‌వ్‌, జ్యోతి, సునిత‌, విజ‌య‌, రాధ‌, సులోచ‌న‌, శార‌ద‌, భాగ్య‌ల‌క్ష్మీ, హైమ‌వ‌తి, యాద‌వ యువ‌త పాల్గొన్నారు.