Wednesday, 4 November 2026

పోటీ పరీక్షల అభ్యర్ధులకు సహకారం అందిస్తాం – గ్రంథాలయంలో అన్ని వసతులు కల్పిస్తాం – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

 

 

 

 

జనంసాక్షి, మంథని : వివిధ ఉద్యోగాల పోటీపరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్ధులకు తమవంతు సంపూర్ణ సహాకారం అందిస్తామని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ భరోసా ఇచ్చారు. మంథని పట్టణంలోని శాఖా గ్రంధాలయాన్ని నిరుద్యోగ యువత అభ్యర్ధన మేరకు సందర్శించి వసతులు, సౌకర్యాలపై పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆరా తీశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విజ్ఞాన బండాగారంగా పిలువబడే గ్రంధాలయంలో అన్ని వసతులకు కల్పనకు కృషి చేస్తానన్నారు. గ్రంధాలయ సమీపంలోనే మరో గదిని అద్దెకు తీసుకుని పోటీపరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. అభ్యర్ధులకు తన సొంత ఖర్చులతో కూలర్లు, రెండు పూటలా బోజన సౌకర్యం కల్పిస్తామని హమీ ఇచ్చారు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు సాధించుకుని ప్రయోజకులుగా ఎదుగాలన్నదే మా ఆకాంక్ష అని అన్నారు. మారుమూల గ్రామాల్లోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పైసా సాయం చేయని వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని, తాము ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తామని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు.