Wednesday, 4 November 2026

విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగమేళా కార్యక్రమం

విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగమేళా కార్యక్రమం*
మెట్పల్లి టౌన్, నవంబర్ 22,
జనంసాక్షి
మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని సంకల్ప ఒకేషనల్ కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం రోజున బిజెపి సీనియర్ యువ నాయకులు పూదారి నిశాంత్ కార్తికేయ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది , ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. పలు కంపెనీల ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను ఆయా కంపెనీల సంబంధిత అధికార బృందంల చే ఇంటర్వ్యూలు చేసి పలువురు విద్యార్థి విద్యార్థులను సెలెక్ట్ చేశారు,అనంతరం బిజెపి పార్టీ సీనియర్ యువ నాయకులు పూదారి నిశాంత్ కార్తికేయ మాట్లాడుతూ ఐసిఐసిఐ ,హెచ్ డి ఎఫ్ సి ,డెక్సోనా పబుమెటిక్ లైట్ బ్యాంకులు మరియు టాటా అమెజాన్, బజాజ్ ,బిపిఓ లావా వంటి కంపెనీలో విద్యార్థిని విద్యార్థులు ఇంటర్వ్యూలు సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో జరిగాయి ,
ఇటువంటి ఉద్యోగ మేళా లో ఎంతో మంది పేద విద్యార్థిని విద్యార్థులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కోరుట్ల నియోజకవర్గంలో తాను ముందుండి నిర్వహించడం జరుగుతుందని దీని ద్వారా మన నియోజకవర్గ విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వారి కుటుంబము సుఖ సంతోషాలతో ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు,ఈ కార్యక్రమంలో సుదర్శన్, తోపారపు నాగయ్య, ఆర్మూర్ రంజిత్. గాజంగి జయకృష్ణ, వంగరి జితేంద్రనాథ్, మిట్టపల్లిసాయి ,గుంటుకగంగాధర్,దివకొండ విష్ణువర్ధన్, వినోద్, శివరాత్రి శంకర్ పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు