తెలంగాణలో నూతనోత్సాహంతో దూసుకుపోతున్న కాంగ్రెస్, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. జాతీయ నాయకత్వ పిలుపు మేరకు రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సభ్యత్వ నమోదుకు సిద్ధమైంది. బూత్ స్థాయి నుంచీ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ నాయకులు, నిరాశా నిస్పృహలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలోనాయకులలో, వారి అంచానలకు తగ్గట్టు పార్టీని బలోపేతం చేయడానికి గురువారం రోజున రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద చందూర్ మండల జడ్పీటీసీ , నిజామాబాద్ జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ అంబార్ సింగ్
ఆధ్వర్యంలో రుద్రూర్ మండల కేంద్రనికి చెందిన 9 మంది ఎన్రోలర్స్ ను నియమించి వారికి ప్రోత్సాహక పూర్వకంగా ఒక్కరికీ ఐదువేల రూపాయలు ను అందించారు , అనంతరం రుద్రూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తోట అరుణ్ కుమార్ ను సన్మానించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ 9 మందిఎన్రోలర్స్ ఆధ్వర్యంలోనే ఆన్ లైన్ సభ్యత్వ నమోదు ప్రక్రియ మొత్తం జరుగుతుందని,బూత్ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు, విధానాలు తీసుకెళ్లి… ప్రజల్ని కాంగ్రెస్ వెంట నడిపించేందుకు ఎన్ రోలర్లు, సభ్యులు క్రియాశీలకంగా ఉండాలని కోరారు, తెలంగాణ రాష్ట్రంతో పాటు , బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయలని కోరారు ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల అధ్యక్షులు అరుణ్ కుమార్ , వైస్ ఎంపీపీ దశ గౌడ్ , చందూర్ మండల అధ్యక్షులు పోతరాజు శ్రీనివాస్ ,చందూర్ గ్రామ అధ్యక్షులు గుర్ల మల్లయ్య , కాంత రావు,బట్టు నగేష్, షేక్ మకదూం, కర్క అశోక్, కాసుల సుధాకర్, రవి కుమార్,నితిన్ పాటిల్,సురేష్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.




