Wednesday, 4 November 2026

పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి  సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్

 

 

 

 

 

 

టేకులపల్లి, ఫిబ్రవరి 12( జనం సాక్షి): అడవి పై ఇక హక్కులు లేవు అని అసెంబ్లీలో ప్రస్తావించడం ముఖ్యమంత్రి కెసిఆర్ అవివేకమని, పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నేతలుడిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బేతంపూడి క్రాస్ రోడ్ లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలలో 11.5 లక్షల మందికి హక్కు పత్రాలు ఇస్తామని చెబుతూనే మరోపక్క అడవిలో ఇక పై ఎవరికి హక్కులు లేవని చెట్టు కొట్టిన పుట్ట కొట్టిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూనే హక్కు పత్రాలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని వారన్నారు. ఎన్నో ఏండ్లుగా పోడు కొట్టుకొని సాగు చేసుకుంటున్న గిరిజనులు, పేదలైనటువంటి గిరిజనేతరులు భూములను సాగు చేసుకునే జీవనం కొనసాగిస్తుంటే హరితహారం పేరుతో గుంజుకొని పసి గుడ్డు కాంచి మొదలుపెడితే గర్భిణీ స్త్రీల వరకు అనేక మందిని జైల్లో పెట్టించారని విమర్శించారు. మరోపక్క సర్వేల పేరుతో భూమిలేని వాళ్లు అందరూ అప్లై చేసుకోమని అంటూనే ఇంట్లో ఉద్యోగం ఉన్నోళ్ళకి గిరిజనలకి ఒక కుటుంబానికి 10 ఎకరాల భూమి అంటూ ఇలా అనేక షరతుల్తోటి దరఖాస్తుల్ని తిరస్కరించినటువంటి పరిస్థితి కూడా ఉందని వారన్నారు. కెసిఆర్ పూటకో మాట మాట్లాడుతూ ప్రజల్ని గందరగోళపరుస్తున్నాడని అన్నారు. నీళ్ల పేరుతో,దేవుళ్ళ పేరుతో, రోడ్ల పేరుతో అనేక నిధులను వృధా చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని అన్నారు. పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అడవులను తాకట్టు పెట్టడం కోసం నూతన అటవీ హక్కుల సంరక్షణ నియమాల పేరుతో కొత్త చట్టాలను తీసుకొచ్చి ఆదివాసులకు ఉన్న పాత చట