సూర్యాపేట ప్రతినిధి, ఫిబ్రవరి 12 ( జనంసాక్షి ): మెరుగైన జీవనశైలితో వివిధ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాస రావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గండూరి జానకమ్మ ఉచిత వాటర్ ప్లాంట్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట, జూనియర్ ఛాంబర్ , పద్మశాలి యువజన విభాగం ఆధ్వర్యంలో అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత రక్త పరీక్షల శిబిరానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు.ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలన్నారు.ఆరోగ్య పరిరక్షణకు రెగ్యులర్ గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.అనంతరం షుగర్ , కొలెస్ట్రాల్ పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి పిసిక వీరయ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ రమేష్ చంద్ర, సెక్రటరీ యాద కిరణ్ , ట్రెజరర్ రాచకొండ శ్రీనివాస్,జూనియర్ ఛాంబర్ ప్రెసిడెంట్ గుండా సతీష్ , నూకల వెంకటరెడ్డి, దూలం నగేష్ , పద్మశాలి యువజన విభాగం అధ్యక్షులు యుగేందర్, సంఘ ప్రచార కార్యదర్శి, కార్యక్రమ నిర్వహకులు పున్నం వెంకన్న , ఉపేందర్, జగదీష్ , రమేష్, అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ సూర్యాపేట ఇన్ఛార్జ్ గంజి రాంచరణ్ , సాయి, మహేష్, ఇస్మాయిల్, శ్రీనాథ్, కుక్కడపు సాలయ్య , బిక్షం , సందీప్ ,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.




