Wednesday, 4 November 2026

పోయిన చరవాణి నీ తెలుసుకునేందుకు కొత్తఅప్లికేషన్ -జిల్లా ఎస్పీ  కె. సృజన.

 

 

 

 

 

గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 17 (జనం సాక్షి);    పోయిన చరవాణి ను తెలుసుకొని పట్టుకునేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ నూతన అప్లికేషన్ ను తీసుకురావడం జరిగిందని, ఈ అప్లికేషన్ ను పోలీస్ యంత్రాంగం తో పాటు ప్రజలు కుడా వినియోగించుకోవచ్చు అని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ  కె. సృజన తెలిపారు. సోమవారము  జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ని సమావేశ హల్ నందు జిల్లా ఎస్పీ జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ల  రైటర్లకు,రిసిప్షనిస్ట్ లకు, ఎస్సై లకు  సి ఇ ఐ ఆర్ అనే కొత్త అప్లికేషన్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా  సి ఇ ఐ ఆర్ గురించి వివరిస్తూ….ఈ అప్లికేషన్ ముఖ్యంగా మొబైల్ ఫోన్ పోయినప్పుడు అట్టి మొబైల్ ఫోన్ పట్టుకోవాడానికి చాలా ఉపయోగపడుతుందని అన్నారు.ప్రస్తుత జీవన శైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలక పరికరం అయ్యిందని ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా నగదు చెల్లింపులు చేయాలన్నా, ఏదైనా దరఖాస్తు చేసుకోవాలన్నా,మొబైల్ ఫోన్ పైనే ఆదారపడుతున్నామని ఇంతటి ప్రాదాన్యం సంతరించుకున్న చరవాణి ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరికి గురైతే పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించనవసరం లేదని అని అన్నారు.పోయిన ఫోన్ లను వెతికి పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందని అయితే నూతనంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన సి ఇ ఐ ఆర్ ఈ అనే అప్లికేషన్  ద్వారా చరవాణి ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరికి గురైనా అట్టి చరవాణి లను వెతికి పట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖా ఆద్వర్యంలో  (సి ఇ ఐ ఆర్ ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రవేశపెట్టిందనీ,ఇందుకోసం www.ceir.gov.in  వెబ్ సైట్ లో లాగిన్ కావాలనీ,అందులో రెక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుందనీ,దానిపై క్లిక్ చేయాలి పోయిన చరవాణి లోని నంబర్లు,ఐఏంఇఐ నంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లులు అప్లోడ్ చేయాలనీ, మొబైల్ ఏ రోజు ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలనీ, చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడి, ఓటిపి కోసం మరో చరవాణి నెంబర్ ఇవ్వాలని ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడి నెంబర్ వస్తుందనీ  సంబంధిత ఐడి ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొబైల్ ఏ కంపెనీ అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఫోన్ పని చేయకుండా చేస్తుందనీ,చరవాణి దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి ఆన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. ఐడి నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. చరవాణి పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలని సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్  సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్లో  సమాచారం నమోదు చేస్తేపోయిన మొబైల్ ఫోన్ త్వరగా దొరకడానికి అవకాశం ఉంటుందని అన్నారు.అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా ఐఏంఇఐ నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని  తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుందని అన్నారు.ఈ  కార్యక్రమంలో డీసీ ఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఐటీ కోర్ టీం ఎస్సై రజిత,ఆన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు , స్టేషన్ రైటర్స్, రిసెప్షనిస్ట్ లు, ఐటీ సెల్ సిబ్బంది  పాల్గొన్నారు.