Wednesday, 4 November 2026

 సింగరేణి ఉద్యోగులతోనే బొగ్గు తీయించాలి……. జేఏసీ ఆధ్వర్యంలో కైరిగూడ ఓపెన్ కాస్ట్ లో ధర్నా…..

 

 

 

 

 

కైరిగూడ ఓపెన్ కాస్ట్ లోని బొగ్గును సింగరేణి కార్మికులు తీయవలసిన దాన్ని ఓబి కాంట్రాక్టర్ ద్వారా తీయించడానికి వ్యతిరేకిస్తూ వెంటనే నిలిపివేయాలని టీబీజీకేఎస్ ఏఐటియుసి ,ఐ ఎన్ టి యు సి, బిఎంఎస్, సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. నాయకులు సైట్ ఆఫీసు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో ప్రైవేటీకరణను కాంట్రాక్టీకరణను అధికారులు ప్రోత్సహిస్తున్నారని వెంటనే వారు వారి వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు సరియైన మిషనరీ మ్యాన్ పవర్ అందిస్తే సింగరేణి కార్మికులు ఎంతటి పనిచేయడానికైనా సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు అనంతరం కైరిగూడ ప్రాజెక్టు ఆఫీసర్ ఉమాకాంత్ గని మేనేజర్ ప్రవీణ్ పటింగ్ నాయకులు…
[6:30 PM, 4/17/2023] +91 99518 65223: సింగరేణి ఉద్యోగులతోనే బొగ్గు తీయించాలి……. జేఏసీ ఆధ్వర్యంలో కైరిగూడ ఓపెన్ కాస్ట్ లో ధర్నా………………………….
కైరిగూడ ఓపెన్ కాస్ట్ లోని బొగ్గును సింగరేణి కార్మికులు తీయవలసిన దాన్ని ఓబి కాంట్రాక్టర్ ద్వారా తీయించడానికి వ్యతిరేకిస్తూ వెంటనే నిలిపివేయాలని టీబీజీకేఎస్ ఏఐటియుసి ,ఐ ఎన్ టి యు సి, బిఎంఎస్, సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. నాయకులు సైట్ ఆఫీసు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో ప్రైవేటీకరణను కాంట్రాక్టీకరణను అధికారులు ప్రోత్సహిస్తున్నారని వెంటనే వారు వారి వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు సరియైన మిషనరీ మ్యాన్ పవర్ అందిస్తే సింగరేణి కార్మికులు ఎంతటి పనిచేయడానికైనా సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు అనంతరం కైరిగూడ ప్రాజెక్టు ఆఫీసర్ ఉమాకాంత్ గని మేనేజర్ ప్రవీణ్ పటింగ్ నాయకులు భైటాయించిన వద్దకు వచ్చారు వారితోనే చర్చించిన నాయకులు బొగ్గును ప్రైవేటు వారితో తీయించడానికి వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు మొదటగా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇట్టి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ధర్నా కార్యక్రమం విరమించాలని చెప్పడం జరిగింది. అయినప్పటికీ వెంటనే నిర్ణయం చెప్పాలని బొగ్గు ప్రైవేటు వారు తీసేదాన్ని నిలిపివేస్తేనే ధర్నా విరమిస్తానని నాయకులు ససేమిరా అనడం జరిగింది .దీనితో ఉన్నత అధికారులతో మాట్లాడిన ప్రాజెక్ట్ ఆఫీసర్ కార్మికులు, నాయకులు కోరిన విధంగా సింగరేణి వారితోనే బొగ్గు తీస్తానని ఆర్డర్లో ఉన్న విధంగా పని చేయిస్తానని ప్రైవేటు వారితో సింగరేణి వారు తీయించే బొగ్గును తీయకుండా చూస్తానని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇచ్చిన మాటను గౌరవించి ధర్నా విరమిస్తున్నామని ,మాటను నిలబెట్టుకోనట్టయితే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేసి గనిలో ఉత్పత్తిని స్తంభింప చేస్తామని ఎంతటి పోరాటానికైనా వెనకాడేది లేదని చెప్పి ధర్నా విరమించ డం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మలరాజు శ్రీనివాసరావు ఏఐటియుసి గోలేటి బ్రాంచి కార్యదర్శి సోమవారపు తిరుపతి ఐ ఎన్ టియు సి బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి పేరం శ్రీనివాస్ బి ఎం ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఓరుకొండ తిరుపతి సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి అంబాల ఓదెలు నాయకులు సంఘం ప్రకాష్ రావు నల్లగొండ సదాశివ్ మారిన వెంకటేష్ గజేల్లి చంద్రశేఖర్ కృష్ణ సంజీవరెడ్డి మారం శ్రీనివాస్ జగ్గయ్య శేషు మరియు ఫిట్ కార్యదర్శులు కారనాతం వెంకటేష్ నాయకులు ఓరం కిరణ్ తిరుపతి భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు..