నిధుల మళ్లింపు కేసులో ఫిర్యాదు..అరెస్ట్
– విచారిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు
హైదరాబాద్,అక్టోబర్5 (జనంసాక్షి): టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో టీవీ 9 స్టూడియోకు వచ్చిన టైమ్ లో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని రవిప్రకాశ్ పై అభియోగాలు ఉన్నాయి. దీనిపై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసుల శనివారం రవిప్రకాశ్ ని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారిస్తున్నారు. టీవీ9 మాజీ సీఎఫ్ వో ఎంకేవీఎన్ మూర్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొంత కాలంగా రవిప్రకాశ్ అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. టీవీ9 సంతకాలు ఫోర్జరీ చేశారని, నిధుల గోల్ మాల్ చేశారని ఇప్పటికే కేసులు నమోదు చేశారు. పలుమార్లు రవిప్రకాశ్ ని విచారించారు. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారని, టీవీ 9లోగో అమ్మారని రవిప్రకాశ్ పై కేసులు ఉన్నాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఏబీసీఎల్ బ్యాంకు ఖాతాల నుంచి రవిప్రకాశ్ అక్రమంగా రూ.12కోట్లకు పైగా నిధులను వాడుకున్నారని, మూడు విడతల్లో రూ.6కోట్ల 36 లక్షలు విత్ డ్రా చేశారని ఫిర్యాదులున్నాయి. అలాగే డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎంకేవీఎన్ మూర్తిపైనా నిధుల విత్‌డ్రా కేసు నమోదైంది. ఆయన రూ.5కోట్ల 97 లక్షలు విత్‌డ్రా చేయగా, మరో డైరెక్టర్ క్లిఫోర్డ్ పెరారీపైనా నిధుల విత్‌డ్రా కేసు నమోదు చేశారు పోలీసులు. పెరారీ రూ.5కోట్ల 97 లక్షలు విత్‌డ్రా చేసినట్లు సమాచారం. అలందా షేర్ ¬ల్డర్లు, డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండా రవిప్రకాశ్ బృందం భారీ మొత్తంలో కంపెనీ నగదును విత్ డ్రా చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమకు తాము భారీగా బోనస్‌లు కూడా ప్రకటించుకున్నారని, ఏబీసీఎల్ కంపెనీని టేకోవర్ చేసిన అలందా విూడియా డైరెక్టర్లు ఈ ఏడాది సెప్టెంబర్ 24న సమావేశమై పక్కదారి పట్టిన నిధులపై బోర్డులో చర్చించారు. అనంతరం రవిప్రకాశ్ అండ్ కోపై క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీంతో అలంద విూడియా సెప్టెంబర్ 4న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల అదుపులో రవిప్రకాశ్




