Tuesday, 3 November 2026

పోలీసుస్టేషన్‌ ముందు యువతి నిరసన

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఓజిలి మండలం పున్నేపల్లికి చెందిన గోను జీవిత ఓజిలి పోలీసుస్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఓజిలి మండలానికే చెందిన భట్లఘనపూర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, జీవిత గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ దుకాణాల్లో సేల్స్‌మెన్‌లుగా పనిచేస్తున్నారు. ప్రేమించిన వెంకటేశ్వర్లు పెళ్లికి నిరాకరించడంతో జీవిత పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించక పోవటంతో యువతి జీవిత పోలీసుస్టేషన్‌ ముందు బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *