హైదరాబాద్: పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఎస్సీ లక్ష్మీనారాయణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానిస్టేబుల్ గిరిప్రసాద్ శర్మతో కలిసి అపహరణ నాటకం ఆడినందుకు ఎస్పీ లక్ష్మీనారాయణపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో సస్పెండ్ చేసిన కానిస్టేబుల్ గిరిప్రాసద్ శర్మను పోలీసులు నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పీటీవో అక్రమాలను బయటపెడతానంటూ బైక్ ర్యాలీ తలపెట్టినందుకు అతడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.




