పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం

చిత్తూరు,మే24(జ‌నం సాక్షి): తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హోంశాఖ మంత్రి నిమ్మనాయకల చినరాజప్ప అన్నారు. వెదురుకుప్పం మండలం కొత్తగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభిచిన ఆయన మాట్లాడుతూ.. తప్పు చేసిన వారిని వెంటనే శిక్షించాలన్నారు. భూ కబ్జాలకు పల్పడే వారిపై ఉక్కు పాదం మోపాలన్నారు. కుటుంబ తగాదాలు జరిగితే వారికి తగిన కౌన్సిలింగ్‌ ఇవ్వాలని సూచించారు. వెనుక బడిన వెదురుకుప్పం మండలాన్ని అభివృద్ధి కోసవ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్‌ స్టేషన్‌ నిర్మించారని ఆయన అన్నారు.