ప్రభుత్వ బడుల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీపీ దశరథ్ రెడ్డి
రామారెడ్డి డిసెంబర్ 28 ( జనం సాక్షి ) :
ప్రభుత్వ బడులను దశలవారీగా బలోపేతం చేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బుధవారం స్థానిక ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి అన్నారు. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో గల జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం దశలవారీగా ( మన ఊరు మనబడి ) సామాజిక అభివృద్ధి చేస్తుందన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పాఠశాల దుస్తులు, మధ్యాహ్న భోజనం అందజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బొమ్మిడి రామ్ రెడ్డి, ఎంపీటీసీ రాజేందర్, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.




