Monday, 2 November 2026

పౌర హక్కులపై అవగాహన అవసరం

-మంథని ఎస్ఐ కిరణ్
జనంసాక్షి , మంథని : పౌర హక్కులపై అవగాహన అవసరం రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మంథని ఎస్ఐ కిరణ్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) ఆదేశాల మేరకు మంథని మండలం లోని రాచపల్లి గ్రామం లో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్ఐ కిరణ్ మాట్లాడుతూ… హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు చేపట్టి హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామసభ నిర్వహించి ప్రజల సమస్యలు, అవసరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.