Tuesday, 3 November 2026

ప్రగాఢ సానుభూతి తెలిపిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

అలంపూర్ జూలై 5(జనంసాక్షి )అలంపూర్ మండలం లోని భీమవరం గ్రామంలో దర్మరెడ్డి బుధవారం ఉదయం అకాల మరణం చెందారు.విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం భీమవరం లోని వారి ఇంటికి వెళ్లి వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం అలంపూర్ మండలం ఊట్కూరు గ్రామనీకి చెందిన ఈశ్వర్ రెడ్డి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని, ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.