*ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి అభ్యర్థి లేగ రామ్మోహన్ రెడ్డి
దేవరుప్పుల, నవంబర్ 13(జనం సాక్షి):* ఎన్నికలు మరికొద్ది రోజులే ఉండటంతో పాలకుర్తిలో రాజకీయం పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి .హోరాహోరీగా కొనసాగుతున్న ప్రచారంలో గెలుపు ఎవరితో ఓటమివ్వరుదో కానీ ప్రచారం మాత్రం వసవతరంగా కొనసాగుతున్నది వచ్చి నిజం. పాలకుర్తిలో ఎర్రబెల్లి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తిరుగులేని నాయకుడిగా, సీనియర్ నాయకుడుగా, ఎర్రబెల్లికి పేరు ఉంది ,పాలకుర్తిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు నిలబడిన గెలుపు మాత్రం ఎర్రబెల్లిదే .తిరుగులేని నాయకుడుగా ఉన్న ఎరబెల్లి పై కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీ లు పోటీకి రెడీ అంటున్నాయి. ఎలాగైనా ఎర్రబెల్లిని గద్దే గద్దె దింపలన్న సంకల్పంతో ప్రచారంలో దూసుకుపోతున్న ఈ రెండు పార్టీలకు ప్రజలు మద్దతు రోజురోజుకి పెరుగుతున్నాయి. 9 సంవత్సరాల కాలంలో తెలంగాణలో అవినీతి ,అక్రమాలు ఎక్కువయ్యాయని, నిరుద్యోగులను అన్యాయం చేస్తూ దళితులను ,అణగారిన వర్గాలను ద్రోహం చేస్తూ నట్టేట ముంచుతున్నాయని టిఆర్ఎస్ పార్టీకి బొంద పెట్టాలని లేగా రామ్మోహన్ రెడ్డి అన్నారు .పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు చేసింది ఏమీ లేదని ,ఎక్కడి గొంగడి అక్కడే ఉందని, తండాలను అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న ఎర్రబెల్లి ఎక్కడ ఈ తండాలను అభివృద్ధి చేశాడో చూపించాలని ఎర్రబెల్లి పై వీరుచుకుపడ్డారు. 9 ఎండ్లాల్లో చేయని అభివృద్ధినీ మరోసారి గెలిపిస్తే ఎర్రబెల్లి చేస్తాడా ? అంటూ రామ్మోహన్ రెడ్డి ఎర్రబెల్లి పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ,టిఆర్ఎస్ పార్టీలు బయట ఒకరిపై మరొకరు రెచ్చిపోతున్నట్లు డ్రామాలు ఆడుతు ప్రజలను మోసం చేస్తున్నారని ఆ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు .ఆ పార్టీలోను నమ్మి ఓటేస్తే మనమంతా బానిసలమవుతామని ఎర్రబెల్లి, యశస్వినీ రెడ్డి నీ ఓడించి ఒకరికి పర్వతగిరికి ,మరొకరికి అమెరికాకు పంపించాలని అన్నారు.ఎర్రబెల్లి కోట్లు కోట్లు దన్నుకున్నారని దగ దయాకర్ రావును ఓడించి పర్వతగిరికి పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ అనేకమంది ఉద్యమకారులను విద్యార్థులను బలి తీసుకున్న పార్టీ అని పాలకుర్తిలో ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్వినీ రెడ్డి నీ గెలిపిస్తే మోసపోతారని అమెరికాలో ఉండే ఝాన్సీ యశస్వినీ రెడ్డిలు మళ్ళీ అమెరికా వెళ్లిపోతారని రామ్మోహన్ రెడ్డి ప్రజలకు సూచించారు.అమెరికాలో ఉండే యశస్విని రెడ్డి ని గెలిపిస్తే మన సమస్యలు ఎలా తీరుస్తానని చెప్పుకొచ్చారు. స్థానికంగా ఉండి స్థానికంగా సమస్యలపై ,ఆపదలో ఆదుకునే అభ్యర్థిని ఎన్నుకుంటే మన సమస్యలు తీరుతాయని అన్నారు .నేను స్థానిక అభ్యర్థిని కాబట్టి కమలం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మీ సమస్యలు తీరుస్తానని, ఆపదలో ఆదుకుంటానని ప్రతిక్షణం మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రజలకు తెలియజేశారు. బీ ఆర్ ఎస్,కాంగ్రెస్ పార్టీలు అబద్ధం చెప్పి మోసం చేస్తున్నట్లు మేము చేయమని ప్రజలను లేగ రామ్మోహన్ రెడ్డి అన్నారు.ఆదివారం రోజున దేవరుప్పుల మండలం కేంద్రంలో ఉన్న బిజెపి కార్యాలయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన బిజెపి కార్యకర్తలను దిశా నిర్దేశం చేస్తూ బిజెపి పాలకుర్తిలో గెలవడం కోసం కార్యకర్తలు అహర్నిశలు కష్టపడాలన్నారు. బిజెపి మేనిఫెస్టోను ఆకర్షితులైన కొడకండ్ల మండలంలోని బొడోనికుంటా తండా గ్రామస్తులు కాసాని సత్తయ్య ఆధ్వర్యంలో పదిమంది బిజెపి పార్టీలోకి చేరగా వారికి పాలకుర్తి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన లేగ రామ్మోహన్ రెడ్డి బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ… దేశంలో మోడీ చేస్తున్న పనులను స్ఫూర్తితో ,రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి పోరాడుతున్న నాయకుల స్ఫూర్తితో బిజెపి నాయకులను పార్టీలను మేము ఆకర్షితులమై మేము కూడా బిజెపి అభ్యర్థిని గెలిపించుకొని సమస్యలను పై పోరాడుతామని పార్టీ కోసమే పని చేస్తూ రామ్మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజల్లో బిజెపి మేనిఫెస్టోను మరింతగా లోతుకు తీసుకెళ్లి బలోపేతం చేపిస్తామని మరింత ప్రచారం చేస్తామని చాలామంది బిజెపిని ఓటేసి గెలిపించుకుంటామని తండాల్లో బిజెపి కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తూ అధిక మెజారిటీ బిజెపికి ఉందని కాబోయే పాలకుర్తి ఎమ్మెల్యేగా రామ్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అన్నారు.