Wednesday, 4 November 2026

ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి – దుద్దిల్ల శ్రీను బాబు

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామంలో శీతల దేవి భూలక్ష్మి మా లక్ష్మి గ్రామ శీల సహిత ఆదిత్యాది నవగ్రహ యంత్ర మూర్తి ప్రాణ ప్రతిష్ట విగ్రహ మహోత్సవ కార్యక్రమంలో శుక్రవారం దుద్దిళ్ళ శ్రీను బాబు పాల్గొన్నారు. యూవత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు , ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ,అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దుద్దిళ్ళ శ్రీను బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగారం గ్రామ సర్పంచ్ బూడిద మల్లేష్ శ్రీను బాబు కు శాలువా కప్పి సన్మానించారు. ఆయన వెంట పలువురు మంథని మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు