మంథని, జనం సాక్షి : దేవుని దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. సోమవారంగురు పౌర్ణమి ని పురస్కరించుకుని మంథని మున్సిపల్ పరిధిలోని గోదావరి నది తీరంలో గల గౌతమేశ్వర స్వామిఆలయాన్ని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సందర్శించి ఆలయ ప్రాంగణంలోని గౌతమేశ్వర స్వామిని, సీతారామ చంద్ర
స్వామిని, శిరిడి సాయిబాబా, శ్రీ బాల సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగాపట్టణంలోని శ్రీ దత్తాత్రేయ దేవాలయాన్ని సైతం సందర్శించిదత్తాత్రేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంథని నియోజకవర్గ ప్రజలు, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాల సంతోషాలతో ఉండేలా చూడమని భగవంతున్ని కోరుకున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా గౌతమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అర్చకుడు గట్టు రాము ఎమ్మెల్యే శ్రీధర్ బాబును శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శశి భూషణ్ కాచే, గోటికార్ కిషన్ జి,
రావికంటి సతీష్, కుడుదుల వెంకన్న, చోప్పకట్ల హనుమంత
రావు లతో పాటు పలువురు పాల్గొన్నారు.
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి – మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు




