Tuesday, 3 November 2026

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

వలిగొండజనం సాక్షి న్యూస్ జూన్ 03 గురు పౌర్ణమి సందర్భంగా సోమవారం వలిగొండలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో స్థానిక సర్పంచ్ బోళ్ల లలితా శ్రీనివాస్ ఎంపీపీ నూతి రమేష్ రాజు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడుదంతూరి సత్తయ్య గౌడ్ పాల్గొన్నారు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సోమనబోయిన సతీష్ సభ్యులు బోళ్ల రామచందర్ బుంగమట్ల కిష్టయ్య బోళ్ల సుదర్శన్ సోమనబోయిన రమేష్ ల పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అజ్ఞానమనే చీకటిని తొలగించే శక్తే గురువు అని తెలిపారు సూర్యాపేట వాస్తవ్యులు ఉత్తంగి వెంకటరమణ భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎమ్మె లింగస్వామి మిర్యాల శ్రీనివాస్ శీలోజు శ్రీరాములు భక్తులు పాల్గొన్నారు