మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 3ఆనంద్ భాగ్ ఆర్యుబి దగ్గర సాయి బాబా దేవాలయంలో ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ అర్చకులు ఎమ్మెల్యే ను శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం అన్నా దాన కార్యక్రమంలో పాల్గొన్నారు.విషుపురి కాలనీలో సాయి బాబా దేవాలయానికి తనవంతు సహకారం అందజేస్తానని తెలిపారు.ఈకార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్,సునీత రామూయాదవ్,జితేంద్ర నాథ్,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,నాయకులు బద్దమ్ పరశురాం రెడ్డి,అధికార ప్రతినిధి,మల్కాజ్ గిరి సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్,సతిష్ కుమార్,రామూయాదవ్,మీడియా కన్వీనర్ గుండా నిరంజన్,సంతోష్ రాందాస్,మోహన్ రెడ్డి, సూరి,సుధాకర్,సంజయ్ ఉపేందర్,బాలకృష్ణ గుప్త, ఆలయ పూజారి సత్యపండిట్,రాంబాబు,ఆనంద్ భాగ్ అస్సోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సాయి బాబ దేవాలయా లలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు.




