నాగర్ కర్నూల్ ఆర్సీ మే23(జనంసాక్షి):నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ బిజినపల్లి మండలంలోని వట్టెం గ్రామం వద్ద ఉన్నటువంటి తుల్జా భవాని,వెంకటేశ్వర రైస్ మిల్లులను మంగళవారం తనిఖీ చేయడం జరిగింది.రైస్ మిల్లర్స్ రైతులు వద్ద నుండి సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించిన అట్టి రైస్ మిల్లులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్ రైస్ మిల్లుల యజమానులకు తెలియజేశారు.సోమవారం జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రైస్ మిల్లర్ల యజమానులు రైతుల ధాన్యం నుండి క్వింటాలుకు రెండు కిలోల ధాన్యం మాత్రమే అధికంగా తీసుకోవాలన్నారు.అది కూడా తూర్పు ఆరా పెట్టుకుని వచ్చిన రైతుల ధాన్యం నుండి ఒక్క గింజ ధాన్యం కూడా అధికంగా తీసుకోవడానికి వీల్లేదు అన్నారు.రైతులకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే స్థానిక అధికారులు లేకుంటే నేరుగా తనకే ఫిర్యాదు చేయాలని ఆయన తెలియజేశారు.తాళ్ల పేరుతో రైతులను ఇబ్బందులు చేయకుండా వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేయాలని ఆదేశించారు.
రైతుల వారి ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకోవాలి అదనపు కలెక్టర్ యస్.మోతిలాల్




