మండల స్థాయి ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలి
– ఎంపీటటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పుట్లూరి రాజశేఖర్ రెడ్డి
తిరుమలగిరి (సాగర్) జనవరి 14 (జనంసాక్షి):
సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు నిర్వహించే మండల స్థాయి ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలని తిరుమలగిరి (సాగర్) మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పుట్లూరి రాజశేఖర్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం తిరుమలగిరి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 11గంటలకు మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.మొదటి బహుమతి 5000 లు,రెండవ బహుమతి 4000 లు,మూడవ బహుమతి 3000 లు,నాలుగో బహుమతి 2000 లు,ఐదవ బహుమతి 1000 లుగా నిర్ణయించారు.ముగ్గుల పోటీల బహుమతులకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.పోటీలలో గెలుపొందిన మహిళలకు చీరలను సర్పంచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి అందిస్తున్నట్లు తెలిపారు.ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు వ్యక్తిగత బహుమతులను నాగేండ్ల కృష్ణారెడ్డి అందిస్తున్నట్లు తెలిపారు.ముగ్గుల పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బహుమతులు పొందాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి,పగడాల సైదులు,నంది బిక్షం,కటికర్ల మల్లయ్య,బత్తుల శ్రీను,షేక్ హమీద్,పాతనబోయిన సురేష్ తదితరులు పాల్గొన్నారు




