Sunday, 8 November 2026

విహార యాత్రతో విజ్ఞానం

విహార యాత్రతో విజ్ఞానం దోమ డిసెంబర్ 25(జనం సాక్షి)
ఎంపీపీస్ గుండాల్ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో విహారయాత్రకు బయలుదేరడం జరిగింది. వరంగల్ లోని చారిత్రక కట్టడాలైన రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, కాకతీయ కళాతోరణం, భద్రకాళి టెంపుల్, లక్నవరం రిజర్వాయర్ ప్రదేశాలను సందర్శించడం జరిగింది. ఈ యాత్రతో విద్యార్థులకు వినోదంతో పాటు పుస్తకాల్లో పొందుపరిచిన చారిత్రక కట్టడాలైన ప్రదేశాలను సందర్శించడం ద్వారా విజ్ఞానాన్ని పొందడం జరిగింది. ఇలాంటి అనుభూతి కలగడం ద్వారా విద్యార్థులు ఆనందంతో పాటు సంతోషాన్ని వ్యక్తం చేశారు, సందర్శించిన ప్రదేశాల్లో గైడ్ ద్వారా కట్టడాల ప్రాధాన్యతను తెలుసుకోవడం జరిగింది. ఈ విహారయాత్రలో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు, ప్రధానోపాధ్యాయులు ఆర్. కేశవులు యాత్రను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు ఇలాంటి ప్రదేశాలు చూపించడం ద్వారా ప్రత్యక్ష అనుభూతుని పొందడమే కాక విజ్ఞానాన్ని పొందుతారని గుర్తు చేశారు.