జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని డిపో లో విలేజ్ బస్ ఆఫీసర్స్ వినూత్న కార్యక్రమము జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంథని డిప్యూటీ ఎమ్మార్వో హాజరై మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమైన ప్రయాణం అంటూ ప్రతి గ్రామంలో ప్రజలకు ఆర్టీసీ బస్సులు చేరువ కావడానికి వెళ్లే ఆఫీసర్స్ కృషి చేయాలని తెలియజేసినారు. డిప్యూటీ తహసిల్దార్ చేతుల మీదుగా విలేజ్ బస్సు ఆఫీసర్స్ కి కిట్స్ ఇవ్వడం జరిగింది. డిపో మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ… విలేజ్ ఆఫీసర్స్ ప్రతి విలేజ్ వెళ్లి ఆర్టీసీ బస్సుల వివరాలు, ఆర్టీసీ తెలియజేస్తానని తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ గ్యారేజ్ ఇంచార్జ్ రామస్వామి, ఆర్ హెచ్ సి వెంకటేశ్వర్లు, విలేజ్ ఆఫీసర్స్ కేకే రెడ్డి, బి కే స్వామి, పి శ్రీనివాస్, వి సమ్మయ్య, ఎస్ గోపాల్, ఆర్ రవితేజ పాల్గొన్నారు.
ప్రజలకు ఆర్టీసీ బస్సు సేవలు చేరువ అయ్యేలా చూడాలి – మంథని డిపో మేనేజర్ శ్రీనివాస్




