Thursday, 5 November 2026

రెబ్బెన తహసిల్దార్ కార్యాలయం ముందు గౌడ్ అన్నల ధర్నా .రెబ్బెన.

జనం సాక్షి: బీసీ కులవృత్తులకు ఇచ్చినటువంటి లక్ష రూపాయల ఆర్థిక సహాయం గౌడ గీతా కార్మికులకు అందించాలి. మరియు బైక్. ఏజెన్సీ గీతా కార్మికులకు లైసెన్సుల పునరుద్ధరణ బ్రాందీ షాపుల్లో 50 శాతం వాటా అందించాలి… గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ఈరోజు కొమరం భీం జిల్లా. రెబ్బెన మండలం తహసిల్దార్ కార్యాలయం ముందు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ ఆధ్వర్యంలో ధర్నా లో మోకు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ గారు మాట్లాడుతూ పొట్ట కూటి కోసం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఆకాశమంత తాటి. ఈత చెట్లు ఎక్కే గౌడ గీత కార్మికులకు బిసి కుల వృత్తుల వారిలో లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకం గౌడ కులానికి వర్తింప చేయకపోవడం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్ మొదటి ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి ఊరు రా వాడవాడల బెల్ట్ షాపులు ఏర్పడడంతో కల్లు నిరాధారణ కు గురై గౌడ్ అన్నలు ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడంతో వృత్తికి దూరమవుతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా అణిచివేతకు కెసిఆర్ ప్రభుత్వం గురిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1 శాతం జనాభా కూడా లేని బ్రాహ్మణులకు కోకాపేటలో 16 ఎకరాల భూమి కార్పోరేషన్ కు 200 కోట్లు. 10 లక్షల దళిత బంధు మిగతా కులాలకు గొర్రెలు, బర్రెలు. వ్యాన్లు ఇచ్చి. వేల కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గౌడ గీతా కార్మికుల ఆర్థిక ఎదుగుదలకు ఏమి చేయలేదని కనీసం ఇప్పటికైనా‌‌ ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం. బైక్. ఏజెన్సీ గీతకార్మికుల లైసెన్సుల పునరుద్ధరణ. బ్రాందీ షాపుల్లో 50% వాటా అందించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల తహసిల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు. 12వ తేదీ సోమవారం గ్రీవెన్స్ డే రోజున కలెక్టరేట్ కార్యాలయల ముందు ధర్నాలు చేపట్టి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వాలని మోకు దెబ్బ పిలుపునిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించని పక్షంలో కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల అధ్యక్షులు మోడం చిరంజీవి గౌడ్. జిల్లా ఉపాధ్యక్షులు రంగు శ్రీనివాస్ గౌడ్. యువత జిల్లా అధ్యక్షులు దేవరకొండ సంతోష్ గౌడ్ .రెబ్బెన గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి కిష్టా గౌడ్. మండల ఉపాధ్యక్షులు మామిడి సతీష్ గౌడ్. నాయకులు ఆకుల సురేష్ గౌడ్. కొయ్యడ సత్యనారాయణ గౌడ్. మోడం వెంకటేశ్వర్ గౌడ్. మల్ల గౌడ్. తిరుపతి గౌడ్. కిష్టా గౌడ్. రవి గౌడ్. రమేష్ గౌడ్. నందం గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు