ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రీరామ నవమి శుభాకాంక్షలురఘునాథ పాలెం మార్చి 29( జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మో రక్షతి రక్షిత సామాజిక విలువను తూ.చ తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని, విలువలను కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజాపాలకుడు సీతారామచంద్రుడు అని మంత్రి పేర్కొన్నారు. భారతీయులకు ఇష్ట దైవమని కీర్తించారు.
లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైందని, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని మంత్రి అజయ్ చెప్పారు. భద్రాచలం సీతారాములవారి ఆశీస్సులు సదా రాష్ట్ర ప్రజలకు ఉండాలని, భద్రాద్రి రామాలయంలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని సీతారామచంద్రులను మంత్రి పువ్వాడ దంపతులు తదితరులు పాల్గొని ప్రార్థించారు.
ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు




