Thursday, 5 November 2026

ప్రజలకు సేవ చేయడమే డీఎన్ఆర్ లక్ష్యం..

ప్రజలకు సేవ చేయడమే డీఎన్ఆర్ లక్ష్యం..
– కాంగ్రెస్ మండల నాయకులు.
ఊరుకొండ, నవంబర్ 17 (జనంసాక్షి):
బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు తనవంతు సేవలు అందించడమే ద్యాప నిఖిల్ రెడ్డి(డీఎన్ఆర్) లక్ష్యమని కాంగ్రెస్ మండల నాయకులు అన్నారు. గురువారం ఊర్కొండ మండల కేంద్రానికి చెందిన మాధారం జంగమ్మ(60) అనారోగ్యంతో బాధపడుతు గత వారం మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి(డీఎన్ఆర్) బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. తక్షణ ఆర్థిక సాయం కింద రూ.5వేలు అందజేశారు. బాదిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని నిఖిల్ రెడ్డి భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. మండల ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి తోడ్పాటు నిస్తూన్నారని అని పేర్కొన్నారు. అదేవిధంగా మండల ప్రజలు బాధలో ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు డీఎన్ఆర్ అని ప్రశంసించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు ఇజ్రాయిల్, వార్డు సభ్యులు రవి వాల్మీకి, సేవదళ్ మండల అధ్యక్షుడు గణేష్, దార రాజు, ఆదినారాయణ, దయాకర్ తదితరులు పాల్గొన్నారు