ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట..
– బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న సీఎంఆర్ఎఫ్..
– జడ్చర్ల ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి.
ఊరుకొండ, నవంబర్ 17 (జనంసాక్షి):
అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల పాలైన ఎంతోమంది బడుగు బలహీన వర్గాల నిరుపేద ప్రజలకు టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం ఊరుకొండ మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపీపీ బక్క రాధా జంగయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి
ముఖ్యఅతిథిగా హాజరై మండలంలోని ఆయా గ్రామాల 11మంది లబ్ధిదారులకు 6.50 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి పనులు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందనీ గుర్తు చేశారు. ఊరుకొండ మండల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున కృషి చేస్తానని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్కరాదజంగయ్య, వైస్ ఎంపీపీ సత్తి అరుణ్ కుమార్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరారెడ్డి, సర్పంచులు రాజయ్య, తలసాని అనిల్ రెడ్డి, ఆంజనేయులు, సుదర్శన్, ఎంపీటీసీ సభ్యులు కలిమిచర్ల గోపాల్ గుప్తా, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, గంగాపురం గోపాల్ రెడ్డి, గిరి నాయక్, నాగోజి. రవీందర్, రమేష్, హరీష్, వివిధ గ్రామాల టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బాధితులు, ప్రజలు పాల్గొన్నారు,
ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట




